Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్ సీజన్-6 ప్రారంభం... ఇప్పటివరకు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది వీళ్లే!

Bigg Boss Season 6 starts
  • మరో మూడ్నెల్ల పాటు వినోదమే వినోదం
  • స్టార్ మా చానల్లో బిగ్ బాస్ కొత్త సీజన్
  • పవర్ ఫుల్ డైలాగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున
  • హౌస్ లోకి అడుగుపెట్టిన కార్తికదీపం ఫేమ్ కీర్తి
  • రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన పింకీ
తెలుగు ప్రేక్షకులకు మరో మూడ్నెల్ల పాటు పసందైన వినోదం అందించేందుకు బిగ్ బాస్ వచ్చేశాడు. బిగ్ బాస్ సీజన్-6 నేటి సాయంత్రం స్టార్ మా చానల్లో అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చారు. "కొత్తగా ట్రై చేయాలంటే నా తర్వాతేరా" అంటూ డైలాగ్ చెప్పి అలరించారు. బంగార్రాజు పాటకు మోడల్స్ తో కలిసి డ్యాన్స్ చేశారు. 

కాగా, బిగ్ బాస్ తాజా సీజన్ లో మొట్టమొదటగా కార్తీకదీపం సీరియల్ నటి కీర్తి భట్ హౌస్ లోకి ఎంటరైంది. కీర్తి కార్తీకదీపం సీరియల్ లో హిమ పాత్ర పోషిస్తోంది. బిగ్ బాస్ ఇంట్లోకి అందరికంటే మొదట అడుగుపెట్టినప్పుడు ఆమె ఆనందం అంతాఇంతా కాదు. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ గా సినీ నటి పింకీ (సుదీప) ఎంట్రీ ఇచ్చింది. పింకీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నువ్వు నాకు నచ్చావ్, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన పింకీ.... నాగార్జునను తమను క్రమశిక్షణలో పెట్టే టీచర్ గా భావిస్తామని చెప్పింది. 

ఆపై మూడో కంటెస్టెంట్ గా శ్రీహాన్ ఎంట్రీ ఇచ్చాడు. గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న సిరి బాయ్ ఫ్రెండ్ గా శ్రీహాన్ కు గుర్తింపు ఉంది. నాలుగో కంటెస్టెంట్ గా ప్రముఖ యాంకర్ నేహా చౌదరి హౌస్ లోకి అడుగు పెట్టింది.
Bigg Boss-6
New Season
Reality Show
Telugu
Nagarjuna
Star Maa

More Telugu News